manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 10:59 am Editor : MANA PRAJA PRATINIDHI

గొల్లగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ ,మెంబర్లను ఎమ్మెల్యే  చింతా ప్రభాకర్ సన్మానించారు

సదాశివపేట జనవరి 8 (మన ప్రజా ప్రతినిధి)

సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామ సర్పంచ్ మునిగే సుజాత నవీన్ కుమార్, ఉప సర్పంచ్ కొల్కూరి అశోక్ కుమార్, వార్డు మెంబర్లతో గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సదాశివపేటలో తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించి సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి మద్దతు సహకారం ఉంటుందని భరోసా కల్పించారు.గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి పక్షాన అద్భుతంగా కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద గొల్ల ఆంజనేయులు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్,గ్రామ మాజీ సర్పంచ్ నవీన్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు నీరడి సర్వేశం, ఎరుకల సంఘం అధ్యక్షుడు ఏం గోపాల్, వార్డు మెంబర్లు,మాజీ వార్డు సభ్యులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.