సూరారం గ్రామానికి అండగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ – కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

•ఎమ్మెల్యే చింతప్రభాకర్ చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీసదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి)ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరోసారి తన సేవాభావాన్ని చాటారు. సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా సూరారం గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సూరారం మాజీ కో–ఆప్షన్ మెంబర్ సలవుద్దిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ కో–ఆప్షన్ మెంబర్ సలవుద్దిన్ మాట్లాడుతూ,“ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న ఉన్నంతవరకు...