మునిపల్లి మండల నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మార్పీఎస్ శుభాకాంక్షలు

మునిపల్లి,డిసెంబర్31(మనప్రజాప్రతినిధి):నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన మునిపల్లి మండలంలోని 32 గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మార్పీఎస్ మునిపల్లి మండల అధ్యక్షులు విజయ్ ప్రసాద్ మాదిగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని కోరారు.గ్రామాభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతూ,...