•రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు
•సిద్దిపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
121 మున్సిపాలిటీలతో పాటు సిద్దిపేట జిల్లాలో చైర్మన్ కేటాయింపులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఏర్పడింది.
రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో
38 స్థానాలు (31.4 శాతం) బీసీలకు, 17 స్థానాలు ఎస్సీలకు, 5 స్థానాలు ఎస్టీలకు, మిగిలిన 61 స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు.
మేయర్ స్థానాల రిజర్వేషన్ వివరాలు
ఎస్టీ కేటగిరీ: కొత్తగూడెం – ఎస్టీ (జనరల్)
ఎస్సీ కేటగిరీ: రామగుండం – ఎస్సీ (జనరల్)
బీసీ కేటగిరీ:
మహబూబ్‌నగర్ – బీసీ (మహిళ),
మంచిర్యాల – బీసీ (జనరల్),
కరీంనగర్ – బీసీ (జనరల్).
జనరల్ కేటగిరీ:
ఖమ్మం – మహిళ (జనరల్),
నిజామాబాద్ – మహిళ (జనరల్),
వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) – అన్‌రిజర్వ్డ్,
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) – మహిళ (జనరల్),
నల్గొండ – మహిళ (జనరల్).
ఇదే ఉత్తర్వుల్లో మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు కూడా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయగా, జిల్లాల వారీగా కేటాయింపులు ప్రకటించారు.
సిద్దిపేట జిల్లాలో చైర్మన్ రిజర్వేషన్లు
సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మున్సిపాలిటీ వారీగా రిజర్వేషన్లు:
సిద్ధిపేట – బీసీ (జనరల్),
గజ్వెల్ – బీసీ (మహిళ),
దుబ్బాక – బీసీ (మహిళ),
హుస్నాబాద్ – ఎస్సీ (జనరల్),
చేర్యాల – ఎస్సీ (మహిళ).
రిజర్వేషన్ల ప్రకటనతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి.