జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా: యువత ఓటు హక్కు వినియోగించాలి
సిద్దిపేట:జనవరి23(మనప్రజాప్రతినిధి)ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని, సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు, అధ్యాపకులు,తల్లిదండ్రు లను ఉత్సాహపరిచుతూ అన్నారు:“ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించి దేశ అభివృద్ధికి భాగస్వామి కావాలి. యువత ఓటరు నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బాధ్యతాయుత పౌరులుగా మెలగాలి.”ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధరిపల్లి నగేష్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు...