manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 5:35 am Editor : Mana Praja Prathinidhi

పంచాయతీ సిబ్బందికి నూతన దుస్తుల పంపిణీ

గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బందికి గౌరవంగా దుస్తుల పంపిణీ
•నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది సంక్షేమ కార్యక్రమం

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి28
దుద్దెడ గ్రామ పంచాయితీలో పని చేస్తున్న సిబ్బందికి సర్పంచ్ మిద్దె శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నూతన దుస్తులు పంపిణీ చేశారు. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ సిబ్బంది సేవలు అమూల్యమని సర్పంచ్ ఈ సందర్భంగా అన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, వార్డు సభ్యులు ఓజయ్య, నవీద్, దేవేందర్, నరేష్, శంకర్, స్వామి, యాదగిరి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.