సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కట్ కార్యక్రమం
సదాశివపేట,జనవరి1(మనప్రజాప్రతినిధి):సదాశివపేటలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్ నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘ నాయకులు అందరూ ఆరోగ్యంగా, ఆయుష్షుతో బాగుండాలని, నూతన సంవత్సరం మన అందరికీ శుభకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం చేసిన పోరాటాలు ఫలించాలని, రాబోయే రోజుల్లో మరింత బలంగా ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం...