గణతంత్ర దినోత్సవం రాజ్యాంగమే మన అసలైన జెండా
- ప్రజాస్వామ్యానికి పునాది- హక్కులతో పాటు బాధ్యతలు- రాజ్యాంగ విలువలపై ఆత్మపరిశీలనజనవరి 26 (మనప్రజాప్రతినిధి),గంజాయి శ్రీనివాస్:భారతదేశ చరిత్రలో జనవరి 26 కేవలం ఒక తేదీ కాదు. అది కోట్లాది ప్రజల ఆశలతో, త్యాగాలతో, ఆలోచనలతో రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహత్తర క్షణం. 1950లో ఈ దేశం “రాజ్యం” నుంచి “ప్రజల రాజ్యం”గా మారిన రోజు ఇది. గణతంత్రం అంటే పాలకులు కాదు, ప్రజలే అధికారం అనే భావనకు రూపుదిద్దిన దినం.మనకు స్వాతంత్ర్యం లభించినప్పటికీ, ఆ స్వేచ్ఛకు సరైన దిశానిర్దేశం చేసినది రాజ్యాంగమే. సమానత్వం,...