manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 11:44 am Editor : Mana Praja Prathinidhi

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి3
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఎన్‌జీఓ భవన్, మెదక్‌లో మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు అప్పటి సమాజంలో విస్తరించిన నిరక్షరాస్యతను మూలంగా చేసుకొని కొనసాగిన సతీసహగమనం, అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలనకు మహిళల విద్యే ఏకైక మార్గమని నమ్మి జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. అనేక అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తమ జీవితాలను సమాజ హితార్థం త్యాగం చేసి, ఆదర్శ దంపతులుగా చరిత్రలో నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, గౌరవ అధ్యక్షులు గంగారాం, రాష్ట్ర వంజరి సెక్రటరీ బొల్లారం రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీమారి శ్రీనివాస్, ఆర్‌టీసీ బీసీ రిటైర్డ్ ఉద్యోగి శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, స్వామినాయుడు, హెచ్‌ఆర్‌ఎఫ్ షేక్ హైమద్, ఎంఆర్‌పీఎస్ బాలరాజు, మాజీ ఎంపీపీ అరుణ, హెచ్‌ఆర్‌ఎఫ్ పీఆర్‌ఏఓ ముక్తాబాయి, ఎన్‌పీఆర్‌డీ శ్రీదేవి, సాప రవి, అనిల్, భూపతి యాదవ్, బాలరాజు యాదవ్, సాయిలు, లాలయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.