సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి3భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఎన్‌జీఓ భవన్, మెదక్‌లో మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు అప్పటి సమాజంలో విస్తరించిన నిరక్షరాస్యతను మూలంగా చేసుకొని కొనసాగిన సతీసహగమనం, అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలనకు మహిళల విద్యే ఏకైక మార్గమని నమ్మి జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు....