manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 11:08 am Editor : Mana Praja Prathinidhi

అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న పత్తేపురం సర్పంచ్ సోమిరెడ్డి

_ఫతేపురం గ్రామ సర్పంచ్ పనితనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
_గ్రామ ప్రజలు కరెంటు కొరతపై తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని ఏఈకి  ఫతేపురం సర్పంచ్ నంద్యాల సోమిరెడ్డి చెప్పడంతో  కొత్త ట్రాన్స్ పురం తక్షణమే పరిష్కారం చూపారు..
_కరెంటు కొరత సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది చూసి తట్టుకోలేక అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే ట్రాన్స్పరం ఏర్పాటు..
_ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు కోరిన సర్పంచ్, గెలిచిన తర్వాత  గ్రామంలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల జనవరి18:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం ఫతేపురం గ్రామం సర్పంచ్ పనితనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడవాడ తిరిగి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు కోరిన సర్పంచ్, గెలిచిన తర్వాత కూడా అదే విధంగా గ్రామంలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కరెంటు గ్రామంలో సరిపడ కరెంటు అందకపోవడంతో  గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని సర్పంచి వెంటనే స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్పందించి వెంటనే కరెంటు కొరతను తీర్చిన పత్తేపురం గ్రామ సర్పంచ్ నంద్యాల సోమిరెడ్డి
సర్పంచ్ స్వయంగా పనులు చేయడంతో గ్రామ ప్రజలు “ఇదే మాకు కావాల్సిన ప్రజాప్రతినిధి” అంటూ అభినందనలు తెలిపారు. గ్రామంలో ఏ సమస్య తన దృష్టికి వస్తే, ప్రజలు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగకుండా తానే పరిష్కరిస్తానని ఫతేపురం గ్రామ సర్పంచ్ నంద్యాల సోమిరెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….