ఆదర్శ గ్రామంగా ఎంపికైన పెద్దాపూర్ తహశీల్దార్ శ్రీనివాస్

మనప్రజాప్రతినిధి//వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని పెద్దాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ రాజ్ గారి ఆదేశాల మేరకు పెద్దాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రధానంగా భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు....