manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:07 pm Editor : MANA PRAJA PRATINIDHI

మరొక్కసారి అవకాశం ఇవ్వండి

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29:

ఖేడ్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా  కౌన్సిలర్ స్థానానికి పోటీ చేస్తున్న తనకు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కౌన్సిలర్ అభ్యర్థి దారం శంకర్ అన్నారు.గురువారం ఖేడ్ లోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తనకు మొదటిసారి అవకాశం కల్పించినప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో వార్డులో సీసీ రోడ్లు,మురికి కాలువలు,త్రాగునీటి సౌకర్యం,ఇందిరమ్మ ఇళ్ళు,విద్యుత్ ట్రాన్స్ఫర్మర్స్ ఏర్పాటు చేశానని మరొక్కసారి అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తాను అన్నారు.