రౌడీ షీటర్లపై పోలీసుల ఉక్కుపాదం
మనప్రజాప్రతినిధి// రాజన్న సిరిసిల్లజనవరి,10జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలను ఆరా తీసి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో...