•బండ మల్లన్న జాతర: అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు-దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండల్,దుబ్బాక నియోజకవర్గం.జనవరి10
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మస్పూర్ గ్రామాల పొలిమేరల్లో ఉన్న బండ మల్లన్న స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ (గురువారం) జరగనున్న జాతర నేపథ్యంలో నేడు సంబంధిత గ్రామాల పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దుబ్బాక సీఐ శ్రీనివాస్, భూంపల్లి ఎస్‌ఐ హరీష్ గౌడ్ పాల్గొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతర సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి జాతరను ఘనంగా జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.