manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 10:36 am Posted by : MANA PRAJA PRATINIDHI

వాణీనికేతన్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 09 జనవరి:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యార్థినిలు  ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేశారు. పర్యావరణాన్ని  పరిరక్షించాలంటూ. సాంస్కృతి  సాంప్రదాయాలను చాటే విధంగా అందమైన డిజైన్లు వేయడం జరిగింది. చిన్నారులకు భోగి పండ్లు పోసి, భోగి మంటలు వేశారు, ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  విద్యార్థుల్లో నిక్షిప్తమైన  సృజనాత్మకతను  వెలికి తీయాలనే లక్ష్యంతో, సాంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి  అందించాలని లక్ష్యంలో భాగంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అందమైన ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూముకుంట్ల శ్రీనిధి, ఉపాధ్యాయులు సుమంగళి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, షమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక. సునీత, స్వాతి, శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.