manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:46 am Posted by : Mana Praja Prathinidhi

కోడిపందాల స్థావరాలపై మెరుపుదాడి!13మంది అరెస్ట్-4 కోళ్లు,రూ.1,500నగదు స్వాధీనం

తొట్టంబేడు,శ్రీకాళహస్తి పరిధిలోఅక్రమ కోడిపందెం బట్టబయలు
పోలీసుల హెచ్చరిక-చట్ట విరుద్ధకార్యకలాపాలపై కఠినచర్యలు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.తిరుపతిజిల్లా.జనవరి17
తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాంతంలో అక్రమంగా కోడిపందెం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకుని,4 కోళ్లు,రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.కోడిపందెం జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పక్కా ప్రణాళికతో దాడి చేపట్టారు. చట్ట విరుద్ధంగా జూద కార్యకలాపాలు నిర్వహిస్తూ, స్థానిక యువతను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఈ దాడి చర్యను తొట్టంబేడు సీఐ తిమ్మయ్య,శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్, ఎస్సై జ్యోతి నేతృత్వంలో ఉన్న పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు. పట్టుబడ్డ నిందితు లను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోడిపందెం వంటి అక్రమ కార్యకలాపాలు చిన్న లాభాల కోసం నిర్వహిస్తున్నా, అవి పూర్తిగా చట్ట విరుద్ధమై నవని, ఇటువంటి ఘటనలపై తట్టుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.