కోడిపందాల స్థావరాలపై మెరుపుదాడి!13మంది అరెస్ట్-4 కోళ్లు,రూ.1,500నగదు స్వాధీనం
•తొట్టంబేడు,శ్రీకాళహస్తి పరిధిలోఅక్రమ కోడిపందెం బట్టబయలు•పోలీసుల హెచ్చరిక-చట్ట విరుద్ధకార్యకలాపాలపై కఠినచర్యలుమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.తిరుపతిజిల్లా.జనవరి17తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాంతంలో అక్రమంగా కోడిపందెం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకుని,4 కోళ్లు,రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.కోడిపందెం జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పక్కా ప్రణాళికతో దాడి చేపట్టారు. చట్ట విరుద్ధంగా జూద కార్యకలాపాలు నిర్వహిస్తూ, స్థానిక యువతను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఈ దాడి చర్యను తొట్టంబేడు సీఐ తిమ్మయ్య,శ్రీకాళహస్తి...