సిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల,వ్యాసరచన పోటీలు

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం,జనవరి3కురుమ ఉద్యోగుల సంఘం (సిద్దిపేట జిల్లా) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ పోటీల్లో కురుమ ఉద్యోగులు, మహిళలు, యువత మరియు పిల్లలందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ముగ్గుల, వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు, అవి క్యాలెండర్ ఆవిష్కరణ రోజున విశిష్ట అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయని వెల్లడించారు.ముగ్గుల పోటీలో పాల్గొనేవారు తాము వేసిన ముగ్గుల ఫోటోలను, వ్యాసరచన పోటీలో పాల్గొనేవారు క్రింద పేర్కొన్న అంశాలలో ఏదైనా ఒక అంశంపై వ్యాసం రాసి, దాని...