విజేతలకు బహుమతుల ప్రధానం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.జనవరి12
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలు, యువతుల కోసం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి.గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. రైతు జీవితాన్ని, సంక్రాంతి పండుగ సంస్కృతిని ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పోటీల అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జలగం అరవిందరావు, ఉప సర్పంచ్ బిట్లు బాబు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి: దూద్దేటి అక్షిత
ద్వితీయ బహుమతి: బొంబోతుల అక్షిత
తృతీయ బహుమతి: పెద్ది శరణ్య
చతుర్థ బహుమతి: ఓరుగంటి అంకిత, జలగం ప్రియాంక
అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేసి ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా సర్పంచ్ జలగం అరవిందరావు మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాల ను కాపాడుకోవడంలో ముగ్గుల పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని, మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమా లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.