కొలనూర్ గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు<br>

విజేతలకు బహుమతుల ప్రధానం మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.జనవరి12సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలు, యువతుల కోసం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి.గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. రైతు జీవితాన్ని, సంక్రాంతి పండుగ సంస్కృతిని ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పోటీల అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గ్రామ...