manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:12 am Editor : Mana Praja Prathinidhi

యువత కోరికకు స్పందించిన ఉపసర్పంచ్ రాజు శర్మ – కబడ్డీ కోర్టు పనులు ప్రారంభం

మనప్రజాప్రతినిధి/మనకొండూరు.జనవరి22
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మూడవ వార్డులో కబడ్డీ కోర్టు ఏర్పాటు కోసం గంగాధర క్షేత్ర వ్యవస్థాపకులు దామోదర శర్మ జ్ఞాపకార్థంగా ఉపసర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ (రాజు శర్మ) తన సొంత ఖర్చులతో మట్టి కుప్పలను పోయించారు.మూడవ వార్డులోని యువకులు కబడ్డీ కోర్టు ఏర్పాటు చేయాలని ఉపసర్పంచ్ రాజు శర్మను కోరగా, వెంటనే స్పందించిన ఆయన ట్రాక్టర్ల ద్వారా మట్టిని పోయించి క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సహకరించారు. యువత క్రీడల్లో ముందుండేలా ఇలాంటి సదుపాయాలు అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యులు శ్రీమతి మామిడి సుశీల, మామిడి రాజు, అంగన్వాడి టీచర్ బైరి అరుణ, నార్ల దినేష్, మామిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.