manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:41 pm Posted by : MANA PRAJA PRATINIDHI

15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా రూబీన బేగం నజీబ్ నామినేషన్

నారాయణఖేడ్//నారాయణఖేడ్ జనవరి 29:

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కౌన్సిలర్ అభ్యర్థిగా రూబీన బేగం నజీబ్ గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందు నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తాను,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తన భర్త నజీబ్ పట్టణ అభివృద్ధికి విశేష సేవలు అందించాము అన్నారు.పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో డివైడర్, బట్టర్ ఫ్లై లైట్లు,ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశాము అన్నారు.తనపై నమ్మకం ఉంచి రెండవసారి అవకాశం కల్పించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించి 15వ వార్డు అభివృద్ధికి మరిన్ని సేవలు అందిస్తాను అన్నారు.