పారిశుద్ధ్య కార్మికుల కడుపు మంట-పంచాయతీ కార్యాలయంలో వంటా-వార్పు ఆందోళన
•పండుగ ముందు జీతాల కరువు… ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల వినూత్న నిరసన. •పారిశుద్ధ్య కార్మికుల కడుపు మంట-పంచాయతీ కార్యాలయంలో వంటా-వార్పుఆందోళనరేణిగుంటమండలం,జనవరి12(మనప్రజాప్రతినిధి):మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పండుగ సమయం సమీపిస్తున్నప్పటి కీ చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పొయ్యిలు రాజేసి ‘వంటా-వార్పు’ కార్యక్రమం నిర్వహిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడకుండా రాత్రింబవళ్లు...