manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 9:36 am Editor : Mana Praja Prathinidhi

ఇర్కోడ్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు-ముగ్గుల పోటీలతో వెల్లివిరిసిన మహిళల సృజనాత్మకత

సిద్దిపేటనియోజకవర్గం,జనవరి14(మనప్రజాప్రతినిధి)
సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం, ఇర్కోడ్ గ్రామపంచాయతీ లో నూతన సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ ఖఛీర్ వద్ద సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా ప్రతిభను రంగురంగుల ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. న్యాయనిర్ణేతల సమక్షంలో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 125 మంది పాల్గొనడం విశేషం.
ముగ్గుల పోటీల్లో విజేతలు
ప్రథమ బహుమతి – కలకుంట్ల రాణికి రూ.3,000,
ద్వితీయ బహుమతి – కుంభం సుస్మితకు రూ.2,000,
తృతీయ బహుమతి – కుచ్చుల శ్రావ్యకు రూ.1,000
లను గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ చేతుల మీదుగా నగదు రూపంలో అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గిఫ్ట్‌లు అందజేయడం కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ,ఉపసర్పంచ్ బొప్పిడిరాజవ్వ.గ్రామ వార్డుమెంబర్లు.సభ్యులు, గ్రామ కారోబార్ సాప ఎల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మారెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిట్యాలసత్యనారాయణ గౌడ్, చల్ల విజేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు, పిల్లలు, బిఆర్‌ఎస్ విద్యార్ధిసెల్ అధ్యక్షులు మంతపురి రంజిత్ గౌడ్. గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ కొత్త ప్రదీప్ గౌడ్. నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.