తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టిన ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ సంక్రాంతి వేడుకలు

మనప్రజాప్రతినిధి రాజన్నసిరిసిల్ల, జనవరి 10: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్‌లో సంక్రాంతి సంబరాలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు.సందడిగా ముగ్గుల పోటీలుపండుగ వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల గొబ్బెమ్మలతో, వినూత్నమైన ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేసిన ఈ ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుసంక్రాంతి విశేషాలను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు,...