manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 2:16 pm Editor : Mana Praja Prathinidhi

శ్రీకాళహస్తిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు-మహిళల ప్రతిభకు రంగోలి పోటీలు ఘన సత్కారం

శ్రీకాళహస్తి,జనవరి11(మనప్రజాప్రతినిధి):

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మహిళల ప్రతిభను ప్రోత్సహించేందుకు రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బొజ్జల బృందమ్మవారి కుమారుడు, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.పట్టణంలోని పొన్నాలమ్మ గుడి వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం లో జరిగిన పోటీలకు నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగుల మేళవింపుతో సొగసైన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి.విజేతలు:మొదటిబహుమతి: వాషింగ్ మెషిన్ -ముగ్గు నం. 05, దివ్య, ఉడమలపాడు, శ్రీకాళహస్తి.
రెండవబహుమతి:LED TV( 32 ఇంచెస్)-ముగ్గు నం. 05,C. గాయత్రి,GKకాలనీ,పానగల్.
మూడవబహుమతి:ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ -ముగ్గునం.91, శ్రీలేఖ,కపుగున్నెరి.
పోటీలలోపాల్గొన్న మహిళలకు ప్రత్యేక బహుమతులుగా రైస్ కుక్కర్లు,హాట్ బాక్స్‌లుఅందజేయబడ్డాయి.
ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, “సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, మహిళల భాగస్వామ్యంతో ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ రంగోలి పోటీలను నిర్వహించాము. మహిళల కళాత్మక ప్రతిభను ప్రోత్సహించడం మా బాధ్యత” అని చెప్పారు.ఈ కార్యక్రమం శ్రీకాళహస్తిలో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చి, మహిళలకు మరపురాని అనుభూతిని అందించింది.