•సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు
•చిన్న పిల్లల గుండె వ్యాధుల గుర్తింపుకు ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి28
కొండపాక శివారులో ఉన్న సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఈ నెల 30న చిన్న పిల్లల కోసం ఉచిత గుండె స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించ నున్నట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో పిల్లలకు గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం 8010119000 నంబర్‌ను సంప్రదించవచ్చని, అలాగే 7075137733 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం పొందవచ్చని వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.