ఉత్తమ ప్రిన్సిపల్‌గా సత్యనారాయణరెడ్డికి అవార్డు

•కళాశాల విద్యాభివృద్ధికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి26సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డును అందుకున్నారు. కళాశాల విద్యాభివృద్ధికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ హైమావతి చేతులమీదుగా ఈఅవార్డునుసత్యనారాయణరెడ్డి స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందన్నారు....