ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జ్యోతి చైతన్య సేవా సంఘం.

చిలకలూరిపేట,జనవరి - 04 (మనప్రజాప్రతినిధి): పట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకు పూలదండలు వేసి సావిత్రిబాయి పూలే  195వ జయంతి వేడుకలు జ్యోతి చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా సమాజానికి తెలిపిన  మహిళా సావిత్రిబాయి పూలే అని వారు అన్నారు. 175 సంవత్సరాల క్రితం మహిళలకు విద్య...