కుసుమ రామయ్య పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం.

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,జనవరి3సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించింది.మహిళా ఉపాధ్యాయులకు ఘన సత్కారంఈ సందర్భంగా పాఠశాల లో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించా రు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు గాను వారిని గౌరవ ప్రదంగా సత్కరించారు.చదువే సామాజిక మార్పుకు...