ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస దొంగతనాలు<br>గర్భిణీ స్త్రీలకు భద్రత కరవు-ప్రజల్లోఆందోళన
సంగారెడ్డి,జనవరి3(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజున ఆసుపత్రి ఆవరణలో మరోసారి దొంగతనం జరగడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ప్రత్యేకంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు సరైన భద్రత లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారిని వెంట తీసుకొచ్చిన సహాయకులకు చెందిన సెల్‌ఫోన్లు, పర్సులు, నగదు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు తరచుగా మాయమవుతున్నాయని బాధితులు వాపోతున్నారు.ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది కొరత, సీసీటీవీ...