manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 1:36 pm Editor : Mana Praja Prathinidhi

ప్రాచీన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖుల ప్రత్యేక దర్శనం

ప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం,జనవరి11
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి ఉన్న ప్రసిద్ద ప్రాచీనశ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి సీబీఐ ఐజీ వీరేష్ ప్రభు, విశాఖపట్నం నుంచి డీఐజీ మురళీ రంభ, తిరుపతి నుంచి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు స్వామివారిని ప్రత్యేకం గా దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి కూడా శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులకు ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, శ్రీ పరశురామేశ్వర దేవాలయంలో ఏప్రిల్ 23వ తేదీన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు.