రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించిన మైనంపల్లి హనుమంతరావు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట–భూంపల్లి మండలం.జనవరి19
అక్బర్‌పేట–భూంపల్లి మండలంలోని ప్రసిద్ధ శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మల్కాజ్‌గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి–సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.