గొర్రెల మందపై వీధి కుక్కల దాడి… 8–10 గొర్రెల మృతి..
•పునరావృతమవుతున్న ఘటనలు… పాలకులు మౌనం•గ్రామస్తుల భయాలు పట్టించుకోని యంత్రాంగం మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి24తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం సృష్టించాయి. గ్రామంలోని యాదవ వీధికి చెందిన బొడుగు నరేష్‌కు చెందిన గొర్రెల మందపై గురువారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి.ఈ దాడిలో సుమారు 8 నుంచి 10 గొర్రెల వరకు మృతి చెందాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో గొర్రెల యజమాని నరేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. గొర్రెల పెంపకమే జీవనాధారంగా...