చైనా మాంజా వినియోగంపై కఠిన చర్యలు తప్పవు-చిరాగ్‌పల్లి ఎస్సై కే.రాజేందర్ రెడ్డి హెచ్చరిక
మొగుడంపల్లి, జనవరి5(మనప్రజాప్రతినిధి):సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రాణాంతకమైన నిషేధిత చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేయవద్దని చిరాగ్‌పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. రాజేందర్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలో చైనా మాంజాను నిల్వ చేయడం,రవాణా చేయడం, తయారు చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు.జాతీయ హరిత ట్రైబ్యునల్ మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చైనా మాంజా వినియోగం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా...