బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
-జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.-రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.-మద్యం సేవించి వాహనాలు నడుపుతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు.మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల జనవరి, 08ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజాశాంతి భద్రతలు,రోడ్డు ప్రమాదాల నివరణయే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం , మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, అందులో భాగంగానే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి...