manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 7:56 am Editor : Mana Praja Prathinidhi

చైనా మంజా దారాలను విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్ ఐ చలికంటి నరేష్

మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి, జనవరి,10:

గాలిపటాలలో చైనా మంజా దారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గరిడేపల్లి ఎస్ ఐ చలికంటి నరేష్ అన్నారు.
శనివారం రోజు గరిడేపల్లి మండల కేంద్రంలోని దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ  మాట్లాడుతూ…మండల ప్రజలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటాలను చైనా మాంజా దారాలతో ఎగరవేయకూడదన్నారు. మామూలు నూలు దారాలతో ఎగురవేయాలని కోరారు.ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘించి చైనా మాంజాను విక్రయించిన,కొనుగోలు చేసి ఉపయోగించిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఎస్ ఐ నరేష్ హెచ్చరించారు.