manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:33 pm Posted by : Mana Praja Prathinidhi

దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ (సిసఫ్–2026) సందర్శించిన పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు

పీఎంశ్రీ ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా సిసఫ్–2026కు వెళ్లిన 8–10 తరగతి విద్యార్థులు

సదాశివాపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):
పీఎంశ్రీ స్కూల్ ఎక్స్‌పోజర్ విజిట్ 2025–26 కార్యక్రమంలో భాగంగా మొగుడంపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ అసద్‌గంజ్ పాఠశాలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం నేడు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన“సౌతేర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ (సిసఫ్)–2026”ను సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు తుల్జా బాయి గారి నాయకత్వంలో, పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సిసఫ్‌లో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇలాంటి సైన్స్ ఫెయిర్‌లకు విద్యార్థులను తీసుకువెళ్లడం వల్ల వారిలో శాస్త్రీయ దృక్పథం (Scientific Temperament) పెరుగుతుందని, సైన్స్ పట్ల ఆసక్తి, సృజనాత్మకత (Creativity) మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం డి. శ్రీనివాస్, నర్సయ్య, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.