గురుకుల ప్రవేశాల గోడపత్రికలు ఆవిష్కరించిన తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//కొండపాకమండల.జనవరి102026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జగదేవ్‌పూర్ (కొండపాక) మండల సామూహిక భవనంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సవిత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన గురుకుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతికి నూతన...