manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 1:39 am Editor : Mana Praja Prathinidhi

ఎమ్మెల్యే సత్తన్న చొరవతో వెల్జీపూర్ రైతులకు మహా శుభవార్త

గ్రామంలోనే ఎరువుల పంపిణీ కేంద్రం-రైతుల్లో ఆనందోత్సాహాలు మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్31
మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (సత్తన్న) చొరవ, నూతన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం సమిష్టి కృషితో వెల్జీపూర్ గ్రామ రైతుల ఎన్నాళ్ల కల సాకారమైంది. గ్రామంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువుల పంపిణీ కేంద్రం ప్రారంభమైంది.ఇప్పటివరకు ఎరువుల కోసం రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రానికి వెళ్లి రవాణా ఖర్చులు, సమయం, పని నష్టాన్ని భరించాల్సి వచ్చేది. ఇకపై గ్రామంలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. రవాణా భారం తగ్గడంతో పాటు వ్యవసాయ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కీలక నిర్ణయానికి సహకరించిన ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ, మండల వ్యవసాయ అధికారి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండా వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లకోమటి శంకర్, యాదవ సంఘం సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంకణాల శ్రావణి నరేష్ రెడ్డి, వార్డు సభ్యులు గొల్ల కమిటీ మల్లవ్వ శంకర్, సోనవేణి (బొజ్జ) శ్రీనివాస్, సంగేపు వేణు, సంగెం ముత్తవ్వ, దేశెట్టి కవిత–బాబుచందర్, వేములవాడ భారతి–రాజేశం, బొల్లారం ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.