ఎమ్మెల్యే సత్తన్న చొరవతో వెల్జీపూర్ రైతులకు మహా శుభవార్త

•గ్రామంలోనే ఎరువుల పంపిణీ కేంద్రం-రైతుల్లో ఆనందోత్సాహాలు మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్31మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (సత్తన్న) చొరవ, నూతన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం సమిష్టి కృషితో వెల్జీపూర్ గ్రామ రైతుల ఎన్నాళ్ల కల సాకారమైంది. గ్రామంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువుల పంపిణీ కేంద్రం ప్రారంభమైంది.ఇప్పటివరకు ఎరువుల కోసం రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రానికి వెళ్లి రవాణా ఖర్చులు, సమయం, పని నష్టాన్ని భరించాల్సి వచ్చేది. ఇకపై గ్రామంలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. రవాణా భారం...