ఇర్కోడ్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
“ప్రధానకూడళ్ల వద్ద కులసంఘాల ఆధ్వర్యంలో జెండాఆవిష్కరణ”మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గ.జనవరి26సిద్దిపేట జిల్లా రూరల్ పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి గణతంత్ర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ప్రైమరీ, హై, మోడల్ స్కూల్ విద్యార్థులు, యువ నేతలు, కుల సంఘాల నాయకుల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ ఘనపురం కృష్ణ, ఉప సర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డు సభ్యులు పాల్గొన్నారు....