కొంతాలపల్లి,శివంపేట మండలం,నర్సాపూర్,జనవరి12:
శివంపేట మండలం కొంతాలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలుపాడిపంటలు, పిల్లాపాప లతో ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామి దయతో అందరూ సంతోషం గా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా, గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి దంపతులకు అయ్యప్ప స్వాములు సన్మానం చేశారు. కార్యక్రమంలో కొంతాలపల్లి ఉపసర్పంచ్ బొల్లారం కుమార్, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.గ్రామస్థులు ఈ ఉత్సవంలో భాగస్వామ్యం కావడం ద్వారా, సాంప్రదాయ దేవాలయ కార్యక్రమాలకు గుర్తింపు వృద్ధిసమాజంలోఏకత భావనపెరుగుతుంద ని చెప్పారు.