manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 1:35 pm Editor : MANA PRAJA PRATINIDHI

అంగరంగ వైభవంగా గురు గంగాధర మహా స్వామి జయంతి

-నూతన సర్పంచులకు  ఉపసర్పంచులు వార్డ్ మెంబర్లు అప్పగారు వారందరినీ శాలువతో సత్కరించి మంగళ ఆశీస్సులు అందజేశారు. 

సదాశివపేట,జనవరి 8 (మనప్రజాప్రతినిధి )

సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట క్షేత్రంలో శ్రీ గురు గంగాధర మహాస్వామి జయంతిని పురస్కరించుకొని  గోపూజ నూతనంగా గురువుగారి మందిర ద్వారపూజ గురువుగారి పాదుకలకు విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమం ష.బ్ర 108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారి కరకమలములచే నిర్వహించడం జరిగింది.
తదుపరి ఆశ్రమ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి వీరశైవ లింగాయత్ మరియు ఆశ్రమ భక్తులు సర్పంచులుగా ఉపసర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలుపొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పగారు వారందరినీ శాలువతో సత్కరించి మంగళ ఆశీస్సులు అందజేశారు.
తదుపరి ఆశ్రమ 30వ వార్షికోత్సవం ఫిబ్రవరి రెండో నుండి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించే విశేష కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా పలు రకాల జిల్లాల సర్పంచులు ఉపసర్పంచులు వార్డ్ మెంబర్లు
వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి జిల్లా సభ్యులు,సదాశివపేట వీరశైవ సమాజం సభ్యులు అర్చక పురోహితులు తదితరులు పాల్గొన్నారు.