manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 12:02 pm Editor : Mana Praja Prathinidhi

మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

కొండాపూర్,జనవరి3(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు.ఉపాధ్యాయులు జి.మహేశ్వరి,షహీన్ బేగం, బి. లావణ్య, జి. శైలజ, ఎస్. కాంతి కిరణ్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ,1831 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లానయగావ్ గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి పూలే, భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో అక్షరజ్ఞానం సంపాదించి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.మహిళా విద్యకు బాటలు వేస్తూ, జ్యోతిరావు పూలేతో కలిసి 1848 జనవరి 1న పుణేలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన మహానీయురా లు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె జీవితం ప్రతి విద్యార్థికి మార్గదర్శకమని పేర్కొన్నారు.