మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం
కొండాపూర్,జనవరి3(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు.ఉపాధ్యాయులు జి.మహేశ్వరి,షహీన్ బేగం, బి. లావణ్య, జి. శైలజ, ఎస్. కాంతి కిరణ్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ,1831 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లానయగావ్ గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి...