తిరుపతి జిల్లాలో బీజేపీ యువమోర్చాకు కొత్త ఊపు… జిల్లా అధ్యక్షుడిగా బండారు పార్థసారథికి ఘన సన్మానం.
•యువతను పార్టీలో చురుకుగా భాగస్వామ్యం చేయడమేలక్ష్యంగా కొత్తజిల్లా అధ్యక్షుడు మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి13బీజేపీ యువమోర్చా (బీజేపీవైఎం) తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన బండారు పార్థసారథిని బీజేపీ సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు. తిరుచానూరు మండలంలో బీజేపీ సీనియర్ నాయకుడు తిరునామలి రూపేష్ బాబు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.రూపేష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్థసారథికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు కలిగిన బండారు పార్థసారథికి ఈ బాధ్యతలు...