మృత్యుపాశంలా మారిన చంద్రంపేట – కొనరావుపేట X బైపాస్ రోడ్డు
మనప్రజాప్రతినిధి రాజన్నసిరిసిల్ల జనవరి,08చంద్రంపేట నుండి కొనరావుపేట వెళ్లే బైపాస్ X రోడ్డు ప్రస్తుతం ప్రయాణీకులకు నరకాన్ని చూపిస్తోంది. గత కొంతకాలంగా ఈ రోడ్డు పూర్తిగా సిగ్నల్స్ వద్ద గుంతలమయమై, అధ్వాన్నంగా తయారైనప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం ప్రమాదాలు బెంబేలెత్తుతున్న ప్రయాణీకులుఈ బైపాస్ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడిపోతుండగా, కార్లు మరియు ఇతర వాహనాలు తరచూ మొరాయిస్తూ...