manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 9:42 am Editor : Mana Praja Prathinidhi

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు జీవనాధారం

వెల్దుర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మనప్రజాప్రతినిధి,నర్సాపూర్.జనవరి8
సీఎంఆర్ఎఫ్ సహాయనిధి పథకం పేద, నిరుపేద కుటుంబాలకు అత్యవసర సమయంలో జీవనాధారంగా నిలుస్తోందని వెల్దుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుసుల మల్లేశం చారి అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
వెల్దుర్తి గ్రామానికి చెందిన హనుమాద్రి కల్పనకు రూ.50,000, గజం నరేష్‌కు రూ.47,500, హనుమద్రి కమలకు రూ.42,500 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిలో సీఎంఆర్ఎఫ్ అత్యంత కీలకమైన పథకమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కృష్ణ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, దండు రాములు, గజం ప్రవీణ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.